వాగులో దంపతులు.. కేసీఆర్‌కు ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

వాగులో దంపతులు.. కేసీఆర్‌కు ఫోన్

September 16, 2020

Farmers stranded in rivulet in dindi

తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో డిండి వాగులో రైతు దంపతులు చిక్కుకుపోయారు.  వారిని సిద్ధాపూర్‌ గ్రామవాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారిని కాపాడాలని సీఎం  కేసీఆర్‌కు ఫోన్ చేసి కోరారు. 

దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కు కూడా ఆయన ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఆ ప్ర్రాంతానికి గజీతగాళ్లను, హెలికాప్టర్‌ను పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోపక్క.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి.  పీర్జాదిగూడలో హనుమాన్ ఆలయం గోడ కూలి ఇద్దరు చనిపోయారు. పలు ప్రాంతాలు నీట మునిగాయి.