ఆత్మహత్యాలు కాదు... బతుకు... పోరాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్యాలు కాదు… బతుకు… పోరాడు

September 4, 2017

తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఇంకా అదే వరుస కొసాగుతున్నది. అదే  యువకులు తమను తాము బలి చేసుకుంటూ నిరసన తెలుపుతున్నారు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు. ఇప్పుడు మారింది కదా. అయినా ఎందుకీ పరిస్థితి  వస్తున్నదనే దానిపై పెద్ద ఎత్తున బయట  చర్చ  జరుగుతున్నది. తాజాగా మాన కొండూరు  నియోజకవర్గంలో ఇద్దరు దళిత యువకుల ఆత్మహత్యా యత్నమే తాజా  ఉదాహరణ.

తమకూ  భూమి ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు.  భూములు రాని వారు ఎంఎల్యేను కల్సిందుకు వెళ్లారు. అక్కడ ఆయన లేరు. తమ సమస్య పరిష్కారం కాదని… తమ జీవితానికి భరోసా  లేదని భావించిన యువకులిద్దరు శ్రీనివాస్, పర్శరాములు   పెట్రోల్ పోసుకుని  నిప్పటించుకున్నారు.  ఆ తర్వాత నాయకుల  హడావిడి  ఉండనే ఉంటుంది.

సమస్యలను  గుర్తించడంలో వాటికి పరిష్కారం చూపించడంలో ఇంకా జాప్యం జరుగుతుండటమే ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం అయి ఉంటుంది. బతుకు దెరువు కష్టం అవుతున్నది. భవిష్యత్తుకు భరోసా లేదు. ప్రభుత్వం ఇస్తామనిచెప్పిన భూమి కూడా దొర్కుతుందో  లేదోననే భాదనే ఇట్లాంటి పనికి వారిని పురిగొల్పింది.  కష్టాలు, బాధలుపట్టించుకునే వారు ఇప్పుడూ లేక పోవడం విషాదమే.

అయితే చిన్న చిన్న విషయాలకే  బలవన్మరణాల  పాలవుతున్నారు  చాలా మంది.  ఇదో సోషల్ ఇష్యూగా  ముందుకు వస్తున్నప్పటికీ  తమ బాధ్యతగా అధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది. తమ వద్దుకు వచ్చే వారిని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో బలగంగా ఉంది అధికారులపై.

ఇట్లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.  తెలంగాణ ఉద్యమం కోసం బలి దానం…. రాష్ట్రం వచ్చాకా బతికేందకూ బలిదానం అంటే….  ఇది మంచిది కాదు. చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. కాక పోతే వాళ్ల  సమస్యను గుర్తించి… మంచి పరిష్కారం చూపిస్తే చాలు… లేదూ  వారికి  నచ్చ చెప్పి  సముదాయించినా సరిపోతుంది. కొందరు అధికారులకు అదీ చేత కావడం లేదు. మార్పు రావాల్సింది ఇక్కడే. ఇలాంటవి జరుగకుండా అన్ని వైపుల నుండి ప్రయత్నాలు జరగాల్సి ఉంది.