Farmhouse,Mlas Deal,BJP vs TRS,Kishan Reddy .Bandi sanjay
mictv telugu

ఫామ్‌హౌస్ సీక్రెట్స్..మునుగోడు లెక్కమారనుందా?

October 27, 2022

Farmhouse,Mlas Deal,BJP vs TRS,Kishan Reddy .Bandi sanjay

ఇప్పటిదాకా ఓ లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క..!ఫామ్‌హౌస్ టు మునుగోడు..మైలేజ్ ఎవరికి..?డ్యామేజ్ ఎవరికి?ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. తీన్మార్ వార్‌లో యమ బిజీగా వున్న నేతలు…కోనుగోళ్ల ఎపిసోడ్ తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికే టైమ్ కేటాయిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి రాష్ట్రస్థాయి నేతలదాకా దీని మీదే వున్నారు.

ఎఫ్ఐఆర్ లో ఏముందంటే…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం..బేరసారాలపై మొహనాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి ఏ1గా,హైదరాబాద్ నందకిశోర్ ఏ2గా,తిరుపతికి చెందిన సింహయాజి ఏ3గా కేసు బుక్ చేశారు.బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇప్పిస్తానని సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి ఆఫర్ చేశారని, నందకిశోర్ మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఎఫ్ఐఆర్ లో వుంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ తనకు రూ.100కోట్లు, మిగతా ఎమ్మెల్యేలు గువ్వలబాలరాజు, రేగా కాంతారావు, బీరంహర్షవర్దన్ రెడ్డికి రూ.50కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పోలీసులతో చెప్పారు. ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరించారని పోలీసులతో ఆయన చెప్పారు. అంతేకాదు సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రప్రభుత్వంలో ఉన్నతపదవులు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రోహిత్ రెడ్డి ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు.

కిషన్ రెడ్డి కౌంటర్

పార్టీ ఫిరాయింపులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లిన రామచంద్రభారతి, నందు, సింహయాజిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంపై కుట్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ కొనుగోళ్ల ఎపిసోడ్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి,అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తొలి నుంచి ఈ వ్యవహారంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని, ఎఫ్ఐఆర్ కాపీలో డబ్బు ఎంత ఉందో చెప్పలేదన్నారు.

బీజేపీ లెవనెత్తిన ప్రశ్నలు

1. ఎమ్మెల్యేల్ని పీఎస్‌కు కాకుండా ప్రగతిభవన్‌కు ఎందుకు తీసుకెళ్లారు?
2.ఎంత డబ్బు దొరికిందో ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చెప్పలేదు
3.దొరికిన ముగ్గురితోపాటు ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారుల ఫోన్ కాల్స్ డేటా ఎందుకు బయటపెట్టడం లేదు.
4..ఫామ్‌హౌజ్‌లో దొరికిన డబ్బు ఎక్కడికి పోయింది?
5.వేర్వేరు కుట్రలకు తెరలేపుతున్నదెవరు?
6.సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు?
7.స్వామీలతో బీజేపీకి ఏం సంబంధం..?
8.ఫార్టీ ఫిరాయింపులు మీరు చేయలేదా?
9.పార్టీలో ఎవరు చేరినా ఓ ప్రాసెస్ వుంటుంది.దానికి భిన్నంగా ఇది జరిగింది.?ఇది కుట్ర కాదంటారా?
10.యాదాద్రిలో ప్రమాణం ఛాలెంజ్ ఎందుకు రావడం లేదు?

ఫామ్‌హౌస్ లో అసలేం జరిగింది?

Farmhouse,Mlas Deal,BJP vs TRS,Kishan Reddy .Bandi sanjay

బుధవారం మొహనాబాద్ అజీజ్ నగర్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ కొనుగోళ్ల ఎపిసోడ్ కు వేదికైంది. సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందు, సింహయాజి ఇక్కడకు వచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్ రెడ్డితో సమావేశమయ్యారు. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇప్పిస్తామని రామచంద్రభారతి ఆఫర్ చేశారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు ఎమ్మెల్యేలు ముందే చెప్పారు. ఎమ్మెల్యేల సమాచారంతో ఫామ్‌హౌజ్ పై రైడ్ చేసిన పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు వచ్చిన కారుని స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు బ్యాగ్ లు వున్నాయి. ఈ బ్యాగుల్లో ఏం వున్నాయనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. బాధితులుగా పేర్కొన్న ఎమ్మెల్యేల్ని ప్రగతిభవన్ కు పంపారు.