ఫరూక్ అబ్దుల్లా నాలుక కోస్తే 21 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

ఫరూక్ అబ్దుల్లా నాలుక కోస్తే 21 లక్షలు

November 22, 2017

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాపై ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ మండి పడింది. ఆయన నాలుక కోసి తెచ్చి ఇస్తే రూ. 21 లక్షల నజరానా ఇస్తామని సంస్థ అధినేత వీరేశ్ శాండిల్య ప్రకటించారు. పీవోకే పాకిస్తాన్‌కు చెందిందని, భారత్ దాన్ని ఎన్నటికీ స్వాధీనం చేసుకోలేదని ఫరూక్ ఇటీవల అన్నారు. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూఖ్..  కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్‌లకు వ్యతిరేకం మాట్లాడుతూ.. దేశద్రోహానికి ఒడిగట్టారని అన్నారు. ఆయన ప్రభుత్వం భద్రత కల్పించకూడదని, వెంటనే జడ్ కేటగిరీ భద్రత తొలగించాలని డిమాండ్ చేశారు.