Home > Featured > మాజీ సీఎం మరో రెండేళ్లు జైలులోనే!

మాజీ సీఎం మరో రెండేళ్లు జైలులోనే!

public safety law..

ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్ అబ్దుల్లాను శ్రీనగర్‌లోని ఆయన నివాసంలోనే గృహనిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని రెండేళ్ల పాటు విచారణ లేకుండానే పీఎస్ఏ కింద నిర్బంధంలో ఉంచవచ్చు. పీఎస్‌ఏ కింద ప్రభుత్వం ఫరూక్‌ అబ్ధుల్లాను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన నివాసాన్ని అనుబంధ జైలుగా వెల్లడించారు.

దీంతో ఆయన తన నివాసంలోనే ఉంటూ బంధువులు, స్నేహితులను కలుసుకునే వీలుంది. గతంలో కూడా కశ్మీరీ నేత షా ఫైజల్‌ను సైతం పీఎస్‌ఏ కింద నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇదిలావుండగా ఫరూక్‌ అబ్దుల్లాను కోర్టులో ప్రవేశ పెట్టాలంటూ రాజ్యసభ ఎంపీ, ఎండీఎంకే అధినేత వైగో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. కోర్టు ఎదుట హాజరుపరచాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్‌ విచారణను సెప్టెంబర్‌ 30న చేపట్టనున్నట్టు సుప్రీం బెంచ్‌ తెలిపింది.

Updated : 16 Sep 2019 6:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top