కారు నడిపిన కుక్క.. రివర్స్‌లోనూ దిట్ట  (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కారు నడిపిన కుక్క.. రివర్స్‌లోనూ దిట్ట  (వీడియో)

November 23, 2019

Fast and fur-ious Florida dog takes car out

ఆ మధ్య బ్రెజిల్‌లో ఓ గడసరి కుక్క వెనక ఇద్దరిని వేసుకుని బైక్ నడిపిన వీడియో ఎంత పా పులర్ అయిందో తెలిసిందే. దాని గురించి మరిచిపోక ముందే మరో ఇస్మార్ట్ కుక్క డ్రైవింగ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ కుక్క ఆ బైక్ నడిపిన కుక్క కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఇది ఏకంగా కారు నడిపింది. అంతేకాకుండా కారును రివర్స్‌లో పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కారు నడపడమే గొప్ప అనుకుంటే ఈ తుంటరి కుక్క కారును వెనక్కి తోలటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఫ్లోరిడాలోని అన్నె సబొల్ అనబడే మహిళకు చెందిన ఈ కుక్క పేరు మ్యాక్స్. అది లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం. అయితే ఆ కుక్క, యజమాని కారులోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ.. కారును రివర్స్‌లో గంట పాటు డ్రైవింగ్ చేసింది. ఈ క్రమంలో కారు ఒకే చోట గుండ్రగా గంట పాటు తిరిగింది. ఆ క్రమంలో అన్నె సబొల్ ఇంటి పక్కన ఉండే మరొక ఇంటి యజమాని పోస్ట్‌బాక్స్‌ను ఆ కారు ఢీకొట్టడంతో ఆ బాక్సు ధ్వంసమైంది. తొలుత అక్కడున్నవారు కుక్క కారును తోలుతోందని గ్రహించలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చేంతవరకు కూడా కుక్క కారును రివర్స్ తోలుతూనే ఉంది. వెంటనే పోలీసులు  కారును ఆపి డోర్ తీసి చూశారు. అందులో వారికి కుక్క కనిపించేసరికి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 

అయితే వారు అన్నె సబొల్‌పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. పక్కింటివారికి కొత్త పోస్ట్‌బాక్స్ కొనిస్తామని చెప్పడంతో వారు చల్లబడ్డారు. కుక్క వెనక్కు డ్రైవింగ్ చేస్తుండటాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.