చిక్కడపల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌‌పై కత్తులు, కర్రలతో దాడి..  - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కడపల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌‌పై కత్తులు, కర్రలతో దాడి.. 

October 1, 2020

Fast Food Center in Chikkadpally

హైదరాబాద్‌‌లో దుండగులు రెచ్చిపోయారు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వచ్చి దాడికి తెగబడ్డారు. హోటల్‌లోని  సామాగ్రిని ధ్వంసం చేశారు.  చిక్కడపల్లిలోని అజామాబాద్‌లోని స్పైస్‌ కోర్టు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో బుధవారం రాత్రి ఇది జరిగింది. ఈ సంఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందుని వ్యాపాారి వాపోయాడు. 

ముఖానికి మాస్కులు ధరించి వచ్చిన ఆరుగురు వ్యక్తులు రావడంతోనే దాడికి తెగబడ్డారు. కత్తులు, కర్రలతో వ్యాపారిని, పని చేసే వారిని బెదిరిస్తూ  దాడి చేశారు.మాస్క్‌లు ధరించి ఉండటంతో వచ్చిన వారు ఎవరనేది గుర్తించలేకపోయారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వ్యాపార లావాదేవీలే దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.