ఆర్డర్‌ చేస్తే.. 10 నిమిషాల్లోనే లిక్కర్ డెలివరీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్డర్‌ చేస్తే.. 10 నిమిషాల్లోనే లిక్కర్ డెలివరీ

June 3, 2022

హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై 10 నిమిషాల్లో లిక్కర్‌ డెలివరీ సేవలను కోల్‌కతాలో ప్రారంభించింది. ఇన్నొవెంట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ‘బూజీ’ బ్రాండ్‌ పేరుతో కోల్‌కతాలో వినూత్న సేవలను తాజాగా ప్రారంభించింది. ఆర్డరు చేసిన 10 నిమిషాల్లో లిక్కరును డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. దేశంలో పలు కంపెనీలు ఇప్పటికే ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై లిక్కర్‌ డెలివరీ సేవలందిస్తున్నప్పటికీ, పది నిమిషాల్లోనే చేరవేసే తొలి ప్లాట్‌ఫామ్‌ తమదేనని ఆన్‌లైన్‌ డెలివరీ అగ్రిగేటర్‌ బూజీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నాకే ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు బూజీ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించింది.