40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి, వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నదిలో పడిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో 12మంది నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15మంది ప్రాణాలతో బయటపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వెళ్తోన్న బస్సు ధార్ జిల్లాలోని ఖాఘాట్ ప్రాంతంలో ఉన్న నర్మదా నది వంతెనపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, స్థానిక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాం. ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందారు. 15 మందిని కాపాడినం” అని వివరించారు.
అనంతరం ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. దాంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.