తెలంగాణ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ సహాయంతో పంప్ హౌస్లోకి దిగుతుండగా, వైర్లు తెగి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిని వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్యాకేజీ వన్లో భాగంగా పనులు జరుగుతుండగా, ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.