ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై కుటుంబ సభ్యులు దర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లాల మేదరమెట్ల హైవే రోడ్డుపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ కారును బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే ఐదుగురు మరణించారు. మరణించినవారంతా అద్దంకి ఎస్సై సమందర్ వలి కుటుంబ సభ్యులని తెలిసినట్లు పోలీసులు తెలిపారు. శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఎస్సైతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చినగంజాం చేరుకున్నారు. ఎస్సై సమందర్ వలి చినగంజాంలో విధుల్లో ఉన్నారు. కుటుంబ షభ్యులు ఆదివారం తెల్లవారుజామున అద్దంకికి కారులో తిరుగుపయనం అయ్యారు.
ఈ క్రమంవోనే కారు మేదరమెట్ల దగ్గరకు రాగానే డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై సమందర్ వలి భార్య , కూతురు, డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అతివేగం, చీకట్లో ప్రయాణం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఒకేకుటుంబానికి చెందిన 5గురు మరణించడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.