Fatal road accident in Balenahalli.. 9 people died on the spot
mictv telugu

ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది స్పాట్ డెడ్

August 25, 2022

కర్ణాటక రాష్ట్రం శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో గురువారం ఉదయం జీపు, లారీ ఢీకొని ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి వివరాలను వెల్లడించారు.

”మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 20 మంది వరకు ఉన్నారు. ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రాయచూర్‌ నుంచి బెంగళూరు వస్తున్న జీపు, లారీని ఢీకొట్టింది. ఇంకా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ తమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ప్రమాదంపై కక్లంబెల్లా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది”అని పోలీసుల తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను సేకరించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. దాంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.