Road Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..వ్యాన్ -ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి..!! - MicTv.in - Telugu News
mictv telugu

Road Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..వ్యాన్ -ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి..!!

February 24, 2023

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపరాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు కూడా సమాచారం. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, చాలా మంది అక్కడికక్కడే మరణించారని భటాపరా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఖిలోరా నుండి అర్జుని గ్రామానికి వెళ్తుండా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

బలోదబజార్-భటపరా రోడ్డులోని ఖమారియా ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఖిలోరా నుండి, సాహు కుటుంబానికి చెందిన వ్యక్తులు పికప్ వాహనంలో అర్జుని గ్రామానికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. 10 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని రాయ్‌పూర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.