వాగులో కొట్టుకుపోయిన కారు.. తండ్రీకూతుళ్లు గల్లంతు - MicTv.in - Telugu News
mictv telugu

వాగులో కొట్టుకుపోయిన కారు.. తండ్రీకూతుళ్లు గల్లంతు

October 23, 2020

car

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో ఘోరం జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొండయ్యగారివంకలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్ళు గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో కొట్టుకు పోయిన తండ్రీకూతుళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

రాత్రి కురిసిన వర్షానికి కొండయ్యగారివంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో వాగు దేటేందుకు యత్నించిన కారు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో డ్రైవర్‌తోపాటు మరో మహిళ సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా చిత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.