father firing on daughter
mictv telugu

మద్యం తాగొద్దని చెప్పిన కూతురిపై తండ్రి కాల్పులు

November 16, 2022

father firing on daughter

తండ్రిని మద్యం తాగొద్దని చెప్పడం నేరమైంది. తల్లితో గొడవపడుతున్న అతనిని అడ్డుకోవడం ఆమె పట్ల శాపంగా మారింది. మద్యం తాగి అల్లరి చేయొద్దన్న కుమార్తెను ఓ తండ్రి హత్య చేశాడు. తుపాకీతో కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధి అబూపుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

శైలేంద్ర కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్థరాత్రి మద్యం తాగి భార్యపై దాడి చేసాడు. తీవ్రంగా ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడే 18 ఏళ్ల కూతరు షాలిని గొడవను ఆపి..తల్లిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెపై తండ్రి శైలేంద్ర గన్‌తో కాల్పులు జరిపాడు. బుల్లెన్ నేరుగా ఛాతీకి తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.