తండ్రి కాదు వీడు.. కన్నకూతురినే కాటేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి కాదు వీడు.. కన్నకూతురినే కాటేశాడు…

September 28, 2018

కన్నబిడ్డను కాటెయ్యాలని ఎలా అనిపిస్తుందో కొందరు దుర్మార్గులకు? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడు అయితే ఆ బిడ్డకు ఇంక రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఇంటి నుంచి ఆడబిడ్డకు రక్షణ కరువైనప్పుడు ఈ సమాజంలో ఆమెకు రక్షణ ఎక్కడినుంచి లభిస్తుంది? ఇలాంటి నీచుల లైంగింక వేధింపులను నియంత్రించి, పిల్లల్లో అవగాహన కల్పించడానికి అధికారులు ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాని పేరు ‘గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌’ అని తెలిసిందే.Father is not .. He is raped doughter …ఆ కార్యక్రమాన్ని ఓ పాఠశాలలో నిర్వహిస్తుండగా కన్న కూతురిపై ఓ వావి వరసలు మరిచిన పశుతండ్రి దాష్టీకం వెలుగులోకి వచ్చింది. 11ఏళ్ళ తన కుమార్తెపై ఆ తండ్రి ఏడాది కాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నాడని తేలింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌ పుడమి పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైల్డ్‌ వెల్పేర్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’ అంశంపై విద్యార్ధినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

విద్యార్థులందరికీ దాని గురించి వివరిస్తుండగా 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని లేచి తన తండ్రి తనపై ఏడాదిగా చేస్తున్న అకృత్యాన్ని బయటపెట్టింది. దీంతో చైల్డ్‌ వెల్పేర్‌ సిబ్బంది అవాక్కయ్యారు. సైదాబాద్‌లోని భరోసా సెంటర్‌లో బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

He is raped doughter …

దీనిపై బాధితురాలి తండ్రి అనిస్ (36)పై అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హనీజ్‌ కార్పెం‌టర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్ళ క్రితం అతని వివాహం అయింది. అల్వాల్‌కు చెందిన యువతిని పెళ్ళి చేసుకోగా వాళ్ళకు ముగ్గురు పిల్లలు(ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) వున్నారు. అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతను పెద్ద కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కటకటాల వెనకకు నెట్టారు.