డాబా ఎక్కి ఫోన్ మాట్లాడుతున్న కుమార్తెను తండ్రి కిందకు తోసేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామనికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని రెండు రోజుల కిందట ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండడం గమనించిన తండ్రి వరప్రసాద్ ఆమెను మందలించాడు. ఫోన్ మాట్లాడొద్దని తీవ్రంగా హెచ్చరించాడు. అయినా ఆమె మరోసారి శనివారం డాబా ఎక్కి ఫోన్ మాట్లాడాడాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించి ఆమె గొంతు పట్టుకుని కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై విద్యార్థిని తల్లి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వరప్రసాద్ మద్యం సేవించి ఉండడంతోనే ఆవేశంలో కుమార్తెను కిందకు తోసేసినట్లు అనుమానిస్తున్నారు