స్పెర్మ్ డొనేషన్ అనేది కాస్త జీర్ణించుకోలేని పదం. దాతలు సాధారణంగా వారి దానం చేసిన స్పెర్మ్ ఉపయోగించి గర్భం దాల్చిన పిల్లలకు చట్టబద్దమైన లేదా జీవసంబంధమైన తండ్రులుగా పరిగణించబడరు. అలా 57 మందికి తండ్రి కానీ తండ్రయ్యాడు. చాలా కేసుల్లో.. స్పెర్మ్ దానం చేసిన తర్వాత ఆసుపత్రి వాళ్లు ఏం చేస్తారన్నది వారికి అనవసరం. వారికి ఎలాంటి లీగల్ రైట్స్ కానీ, పిల్లలు పుడితే వారికి ఎలాంటి సంబంధం ఉండదు. దాతలు సాధారణంగా జన్యు, వైద్య పరిస్థితుల కోసం పరీక్షించబడుతారు. వివరణాత్మకంగా వ్యక్తిగత, వైద్య సమాచారాన్ని అందించాలని భావిస్తున్నారు. కానీ వారు పిల్లలతో లేదా పిల్లల కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండరు. స్పెర్మ్ బ్యాంకులు తెలిసిన దాతలను మాత్రమే అనుమతిస్తాయి. ఇక దాత గురించి గ్రహీతకు తెలుస్తుంది.
స్పెర్మ్ డొనేషన్ అనగానే మనకు ప్రముఖ బాలీవుడ్ చిత్రం.. విక్కీ డోనర్ గుర్తుకు వస్తుంది. స్పెర్మ్ ఇచ్చి పిల్లలను కనడానికి కుటుంబాలకు సహాయం చేసే వ్యక్తి కథ. ఇంచుమించు అలాంటి వ్యక్తే కైల్ గోర్డీ.. వృత్తిపరమైన స్పెర్మ్ డోనర్. అతను ఇప్పటివరకు 57 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. అతను తన ద్వారా పుట్టిన పిల్లలతో సన్నిహితంగా ఉండేందుకు ఇష్టపడుతాడు. కానీ తనకంటూ ఒక అమ్మాయిని కనుగొనడానికి చాలా కష్టమవుతుందని అంటున్నాడు. కైల్ గోర్డీ చాలామంది కలలను సాకారం చేసిన వ్యక్తి. రెండు సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాడు. తాను చేస్తున్న పనిని కూడా దాచుకోవాలనుకోలేదు. అందుకే ఇన్ స్టాలో ఈ వివరాలను పెట్టేవాడు. దీంతో చాలామంది మహిళలు తనకు మెసేజులు పెట్టడం ప్రారంభించారట. 30 సంవత్సరాల వయసు గల కాలిఫోర్నియాకు చెందిన గోర్డీని చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారని, తాను మాత్రం తన కలల రాకుమారిని కలుసుకోలేదని చెబుతున్నాడు. తనకంటూ ఒక కుటుంబం లేదు. అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక కూతురు కూడా ఉంది. కానీ ఆమె గోర్డీని వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇంకో అమ్మాయి గురించి ఆలోచించడం లేదంటున్నాడు. ఒకవేళ మళ్లీ డేటింగ్ చేసినా స్పెర్మ్ డోనేషన్ మాత్రం ఆపేదిలేదంటున్నాడు.