భార్యపై కోపాన్ని కూతురిపై చూపాడు ఓ కసాయి తండ్రి. భార్య జాబ్ తెచ్చుకోలేదని కూతురిని చితకబాదాడు. కన్న కూతురని కూడా చూడకుండా ఆమె ముఖంపై ఉమ్మి వేశాడు. ఈ నీచ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలో బస్ కండక్టర్గా పనిచేస్తున్న అజీముద్ధీన్కు భార్య ఇద్దరు కూతుళ్లు. భార్య ఉద్యోగం చేయాలని రోజు గొడవ పడేవాడు. రోజు సాయంత్రం తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కూతుళ్లను భయబ్రాంతులకు గురి చేసేవాడు. తాజాగా తాగిన మత్తులో ఇంటికి వచ్చిన అజీముద్దీన్ భార్యను విచక్షణ రహితంగా చితకబాదాడు. దెబ్బలు తాళలేక ఆమె ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. దీంతో చిన్న కూతురుని పట్టుకుని కొట్టాడు.
ఈ సందర్భంలో ఆ చిన్నారి ముఖంపై ఉమ్మి వేశాడు. ఈ సంఘటను అతడి భార్య వీడియో తీసింది. ఆ వీడియోను తన తల్లిదండ్రులకు చూపించింది. వారు ఆమెకు మద్దతుగా నిలువలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అజీముద్దీన్ను అరెస్ట్ చేశారు. తల్లి ఇద్దరకు కూతుళ్లను ప్రభుత్వ ఆధర్వ్యంలోని సఖి కేంద్రానికి పంపించారు. మరో వైపు ఇద్దరు కూతుళ్లు కావడంతో రోజు వారిపై దాడి చేస్తున్నాడని పోలీస్ విచారణలో తేలింది. వీరికి 2014లో వివాహం అయింది. అయితే ఆమె టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. దీంతో ఉద్యోగం చేస్తుందనే ఆశతో అజీముద్దీన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. దీంతో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాడని పోలీస్ విచారణలో తేలింది.