చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో సందడి చేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో సందడి చేశాడు!

June 18, 2022

బిడ్డల పెళ్లిళ్లను ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి ఘనంగా చేయాలని తల్లిదండ్రులు ఆశపడతారు. కొందరి విషయంలో ఇది నెరవేరదు. కోరిక తీరకుండా చనిపోతుంటారు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలకు తమ పెళ్లిళ్లల ఆ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తండ్రి లేని ఓ అమ్మాయి విషయంలో ఈ కొరత లేకుండా ‘తండ్రి’ సమక్షంలో సంబరంగా వేడుక పూర్తయింది. దీనికి సంబంధింన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలియడం లేదు.
పెళ్లికూతురు పీటలపై ఉండగా.. హఠాత్తుగా తండ్రి విచ్చేశాడు. ఆమెతోపాటు పెళ్లికొచ్చిన వాళ్లందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు. తన చెల్లి పెళ్లిలో తండ్రి లేని లోటు కనిపించకూడదని పెళ్లి కూతురు అన్న ఈ విగ్రహం చేయించి అందర్నీఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎప్పుడో చనిపోయిన తండ్రి కళ్లెదుట కనిపించడంతో వధువు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తల్లి కూడా చలించిపోయింది. అందరూ తండ్రితో ఫోటోలు దిగి వేడుకను మరింత సంతోషమయం చేశారు.