Father Worshiping own Daughter
mictv telugu

కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి

November 22, 2022

Father Worshiping own Daughter

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు వెలకట్టలేనివి. ఎంతో అప్యాయంగా, ఆనందంగా అయిన వారితో జీవితాన్ని గడుపుతారు.అకస్మాత్తుగా సభ్యుల్లో కొందరు లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేరు. దీంతో వారి గుర్తుగా విగ్రహాలను, గుడిలు కట్టి పూజించుకోవడం ఈ మధ్య మనం చూస్తున్నాం. తాజగా 11 ఏళ్ల క్రితం చనిపోయిన కూతరికి గుడి కట్టించి పూజలందిస్తున్నాడు ఓ తండ్రి.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరుకు చెందిన చెంచయ్య లక్ష్మమ్మ భార్యాభర్తలకు ఐదుగురు సంతానం. వారిలో నాలుగో సంతానంగా కుమార్తె సుబ్బలక్ష్మమ్మ జన్మించింది. ఆమె పుట్టాక కుటుంబం సుఖసంతోషాలు రావడంతో కుమార్తెపై తండ్రి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. డిగ్రీ వరకు సుబ్బలక్ష్మమ్మకు చదువు చెప్పించారు. తర్వాత ఆమెకు అటవి శాఖలో ఉద్యోగం సంపాందించి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటంది. ఈ సమయంలో ఊహించని సంఘటన ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ మృత్యువాత పడింది. దీంతో తల్లిదండ్రులు చెంచయ్య లక్ష్మమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. కూతురు కోసం రోజు తలుచుకుంటూ బాధపడేవారు. ఈ క్రమంలో ఒకరోజు తండ్రి చెంచయ్యకు కుమార్తె సుబ్బలక్ష్మమ్మ కలలో కనపడింది. తనకు గుడి కట్టించాలని కోరిందట. దీంతో చెంచయ్య తన కూతురిపైన ప్రేమతో గుడి నిర్మించి కుమార్తె రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆమె జన్మదినం నాడు ఆరాధనోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. కూతురికి గుడి కట్టి పూజలందిస్తున్న తండ్రిపై ప్రేమను అందరూ ప్రసంసిస్తున్నారు.