ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రతి విటమిన్ అవసరం. ప్రతి విటమిన్ శరీరంలో దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో శరీరానికి విటమిన్ డి3 అత్యంత ముఖ్యం. ఇది మన శరీరానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. కానీ శరీరంలో విటమిన్ డి3 లోపించినప్పుడు కొన్నిసార్లు మన ఆలోచన, మెదడు పనితీరు, హార్మోన్ల ఆరోగ్యం, శారీరక సమస్యలను కలిగిస్తుంది. ఇదే కాకుండా విటమిన్ డి3 లోపం వల్ల వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
విటమిన్ డి3 లోపం లక్షణాలు
1. దీర్ఘకాల అలసట.
విటమిన్ డి3 మీ శరీరంలో జీవక్రియకు సంబంధించింది. శరీరంలో నొప్పి, అనేక ఇతర సమస్యలు విటమిన్ డి3 లోపంతో కనిపిస్తాయి. దీంతో శరీరం చాలాకాలం పాటు అలసిపోతుంది.
2. కండరాల బలహీనత:
విటమిన్ డి3 లోపం కారణంగా కండరాలు బలహీనంగా మారుతాయి. విటమిన్ డి లేకపోవడం వల్ల శరీరం ప్రో-విటమిన్ కాల్సిడియోల్ ను సంశ్లేషణ చేయలేకు చర్మ సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా కండరాల బలహీనత ఉంటుంది.
3. డిప్రెషన్ :
విటమిన్ డి3లోపం మిమ్మల్ని డిప్రెషన్ వైపు మళ్లిస్తుంది. వాస్తవానికి ఇది మూడ్ స్వింగ్ లను నివారించడంలో సహాయపడటంతోపాటు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. కానీ శరీరంలో డి3 లోపించినప్పుడు డిప్రెషన్ కు గురవుతారు.
4. రోగనిరోధకశక్తి తగ్గడం
తరచుగా జబ్బుల బారిన పడటం డిప్రెషన్ కు దారి తీస్తుంది. ఈ విటమిన్ డి3 లోపం రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది. పదే పదే ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది.
సహజంగా విటమిన్ డి3 పెంచుకోవడం ఎలా?
విటమిన్ డి3లోపం నుంచి బయటపడాలంటే..ఆహారంలో గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, వెన్నతోపాటు ఇతర ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. ఉదయాన్నే సూర్యకాంతికి ఉండాలి.