ఐబ్రోస్ చేయించుకోవద్దు

కఠిన నిబంధనలు, నిషేధాలకు పేరుగాంచిన యూపీలోని ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ సంస్థ మరోసారి ఫత్వా జారీ చేసింది. మహిళలు జట్టును కత్తిరించుకోవద్దని, ఐబ్రోస్ చేయించుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇస్లాం నియమాల ప్రకారం ఈ ఫత్వా జారీచేశామని దేవ్ బంద్ మౌలానా ఖాజ్మీ చెప్పుకొచ్చారు. ముస్లింలు గడ్డాలు పెంచుకుని తీరాల్సిందేనని దేవ్ బంద్ ఇదివరకు ఫత్వా జారీ చేసింది. గడ్డాలు పెంచుకోవడానికి వీల్లేని ఉద్యోగాలను వదిలేయాలని సూచించింది. దేవ్ బంద్ ఫత్వాలు కొంతకాలంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి ఈ సంస్థ  మారడం లేదని, ఇంకా మధ్యయుగాల చీకటి కాలంలోనే ఉందని ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు.

SHARE