భయం వద్దు.. త్వరలో 100 పడకల కోవిడ్ వార్డు - MicTv.in - Telugu News
mictv telugu

భయం వద్దు.. త్వరలో 100 పడకల కోవిడ్ వార్డు

July 11, 2020

Siddipet

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య నానానటికి పెరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ప్రజలకు ధైర్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా ప్రజలు కరోనా గురించిన భయాందోళనలకు గురి కావొద్దని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 

జిల్లా ఆసుపత్రిలో వున్న ఐసోలేషన్‌కు అదనంగా స్థానిక ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో 100 పడకల కరోనా వార్డును ఈనెల 15న ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యంపై ఏమాత్రం అనుమానం ఉన్నా..స్థానిక పీహెచ్‌సీలో సంప్రదించాలని కోరారు. ఆసుపత్రిలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే అన్ని రకాల ఆహార పదార్ధాలు అందిస్తామని స్పష్టంచేశారు.