ఫైన్ల ఎఫెక్ట్.. కొడుకును గదిలో బంధించిన తండ్రి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫైన్ల ఎఫెక్ట్.. కొడుకును గదిలో బంధించిన తండ్రి..

September 11, 2019

Fearing challan.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంతో వింతలు, విడ్డూరాలు నమోదవుతున్నాయి. ఈ చట్టం ప్రకారరం మైనర్లు వాహనం నడిపితే.. వాహన యజమానికి రూ.25 వేల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష పడ్డమేకాకుండా, వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు అవుతుంది. ఈ నేపథ్యంలో కొడుకు బైక్ అడుగుతున్నాడని ఓ తండ్రి చేసిన నిర్వాకం వార్తలకెక్కింది. సదరు తండ్రి తన సుపుత్రుణ్ని  గదిలో వేసి తాళం పెట్టాడు. ఆ కొడుకు మైనర్ కావడ, అతడికి లైసెన్స్ లేకపోవడమే ఇందుకు కారణం. 

చలాన్ల భయంతో తల్లిదండ్రులు.. మైనర్ పిల్లలకు, లైసెన్స్ లేని పిల్లలకు బైక్‌లు, ఇతర వాహనాలు ఇచ్చేందుకు భయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ధరమ్‌ సింగ్‌ తన 16 ఏళ్ళ కొడుకు ఒత్తిడి మేరకు కొన్నాళ్ల క్రితం బైక్‌ను కొనిచ్చాడు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కొడుకు బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడితే.. భారీగా జరిమానా, జైలు శిక్ష విధిస్తారని భయపడిన సింగ్.. కొడుకును ఓ గదిలో నిర్బంధించాడు. బైక్ తాళాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో నిర్బంధంలో ఉన్న కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి తన తండ్రిపై పిర్యాదు చేశాడు. పోలీసులు ధరమ్‌ సింగ్‌ ఇంటికి చేరుకుని.. తండ్రి కొడుకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.