చెడ్డపని చేసి కాలు విరగ్గొట్టుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

చెడ్డపని చేసి కాలు విరగ్గొట్టుకున్నాడు..

November 18, 2022

పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఓ యువకుడు బిల్డింగ్‌పై నుంచి దూకి అస్పత్రి పాలైన ఘటన పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఉద్దగిరి అలేఖ్య అనే యువకుడు దొంగనోట్లు ముద్రిస్తున్నాడన్న వార్తతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అతనిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. చివరికి అతని నివాసానికి వెళ్లడంతో పోలీసులను చూసి నిందితుడు భయపడిపోయాడు. వారి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇంటిపై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో అతని కాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి వద్ద సుమారు రూ.కోటీ 50 లక్షల రూపాయుల విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలోనే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. దొంగనోట్ల ముద్రణ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.