వాలెంటైన్స్ డే.. ప్రేమపక్షుల రోజు.. జగమంతా రొమాంటిక్ మూడ్లో వెల్లే సుదినం. అయితే ఈ రోజునుంచి ఒక వారం రోజుల వరకు గర్భధారణలు కూడా ఎక్కువగానే జరుగుతుంది. దాంతో అక్టోబర్, నవంబర్ నెలలకల్లా కొత్త జీవులు లోకంలోకి వస్తున్నారు. జనాభా పెరుగుదలకు తమ వంతు దోహదం చేస్తున్నారు..
బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2015 ఫిబ్రవరి రెండు, మూడు వారాల డేటాను వారు విశ్లేషించారు. ఆ డేటా ప్రకారం.. ప్రేమికుల దినోత్సవ వారంలో 16,263 మంది గర్భం దాల్చారు. వారంలో సగటు గర్భధారణ (15,427) కంటే ఈ సంఖ్య 5 శాతం ఎక్కువ. మామూలుగా క్రిస్మస్ సెలవుల్లో ఎక్కవుగా గర్భాలు ధరిస్తుంటారు. తర్వాత ఎక్కువ గర్భంగా నమోదయ్యేది ప్రేమికుల వారంలోనే అని అధ్యయనంలో పాల్గొన్న శారా జేన్ మార్ష్ తెలిపారు.