భారత్‌లో జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం ఆపరేటర్స్ 5జీ నెట్వర్క్ విడుదల చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీలు పోటాపోటీగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఏ బ్రాండ్‌కు ఉండే క్రేజ్ ఆ బ్రాండ్‌కు ఉన్నప్పటికీ..వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉన్న క్రేజ్ కాస్త డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఈ వన్‌ప్లస్ 11 5జి స్మార్ట్‌ఫోన్ మరికొన్ని రోజుల్లో భారత్ కు వచ్చేస్తోంది. ఐఫోన్ తర్వాత మళ్లీ అంత క్రేజ్ ఉన్న బ్రాండ్ వన్ప్లసే. ఈ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 7న ఇండియాలో లాంచ్ కాబోతోంది.
ధర
వన్‌ప్లస్ 11 5జి ఫోన్లో 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 35 నుంచి 40 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ వివరాలు విడుదల రోజు అధికారికంగా వెల్లడికానున్నాయి. వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే పరంగా చూస్తే ఈ ఫోన్ 3216×1440 పిక్సెల్స్‌తో 2K రిజల్యూషన్‌తో 6.7 ఇంచ్ పంచ్ హోల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఫీచర్స్
కెమెరా ఫీచర్స్ పరంగా చూసినట్లయితే .. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ మూడు కెమెరాల సెటప్‌తో డిజైన్ చేశారు. ప్రైమరీ కెమెరా 50మెగాపిక్సెల్ తో వస్తుండగా.. 48మెగాపిక్సెల్ లెన్సెస్‌తో సోనీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 1.2 పోర్ట్రెట్ సోని కెమెరాను అమర్చారు. అంతేకాదు చాలా రకాల ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే… 5000 ఏంఏహెచ్ బ్యాటరీతో 100 వాట్ ఫాస్ట్ చార్జర్‌తో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.