మన మలమూత్రాలు ఇక నీరుగా.. తొలిసారి వరంగల్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

మన మలమూత్రాలు ఇక నీరుగా.. తొలిసారి వరంగల్‌లో

October 6, 2018

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగి, కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఆధునిక పద్ధతిలో మానవ మలమూత్రాలను శుద్ధిచేసి, నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లు వచ్చేశాయి. ఫీకల్ సెప్టెజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎఫ్‌ఎస్‌టీపీ) పేరుతో దేశంలో తొలిసారిగా తెలంగాణలోని వరంగల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ను అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కాజీపేటలోని అమ్మవారిపేటలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆస్కి, వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన బంక బయో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

trt

కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ…‘మానవ వ్యర్థాలను వివిధ దశల్లో శుద్ధిచేసి నీరుగా మార్చుతుంది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దీని ద్వారా రోజుకు 14వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ నీటని ఉద్యానవనాల్లోని మొక్కల పెంపకానికి, రోడ్లను శుభ్రం చేయడానికి వినియోగిస్తారు’ అని చెప్పారు.

‘ఆధునిక  సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మానవ వ్యర్థాలను అధిక వేడిమి వద్ద కాల్చి ఎరువులను తయారు చేస్తున్నాం. వరంగల్‌ మహా నగరాన్ని ఓడీఎఫ్‌ 2.0గా తీర్చిదిద్దేందుకు ఈ ప్లాంట్‌  మరింతదోహదపడుతుంది’ నగర కమిషనర్ గౌతమ్ అన్నారు. ఈ ప్లాంటు గురించి ఆస్కి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్‌ శ్రీనివాసాచారి, బంక బయో కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నమితలు పూర్తిగా  వివరించారు.