ఒక రూపాయికే బైక్.. ఫెడరల్ బ్యాంక్ ఆఫర్! - MicTv.in - Telugu News
mictv telugu

ఒక రూపాయికే బైక్.. ఫెడరల్ బ్యాంక్ ఆఫర్!

September 27, 2020

MNFCB

కేవలం ఒక్క రూపాయికే బైక్ అందిస్తున్నట్టు ఫెడరల్ బ్యాంక్ తన కష్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఈఎంఐతో బైక్‌ను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. దేశంలోని ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మరోవైపు  ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది.

3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పించింది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతేకాదు 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు స్పష్టంచేసింది.