ఒక్కడితో మొదలై..వేల మందిని కదిలించింది..! - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కడితో మొదలై..వేల మందిని కదిలించింది..!

July 8, 2017

పాతికేళ్ల కుర్రాడికి చదువైపోగానే మంచి కార్పోరేట్ కంపెనీలో జాబ్ వచ్చింది,మంచి జీతం..అప్పుడు అతను ఏం చేస్తాడు… హాయిగా వీకెండ్ పార్టీలనీ.. ప్రెండ్స్ తో సరదాలు,మాల్స్ లో షాపింగులు ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు.మంచి జాబ్.. మంచి జీతం ఉంటే ఎవ్వరైనా ఇదే చేస్తారు కదా..కానీ ఢిల్లీలో ఉండే అంకిత్ అనే కుర్రాడు మాత్రం అలా చేయలేదు,ఉన్న ఉద్యోగాన్ని..పార్టీలు జల్సాలు ఇవన్నీ వద్దనుకున్నాడు,మరి ఏం చేసాడు?

పెళ్లిలో కొత్తదారి..!

మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఉన్న ఓ సెలెబ్రిటీ పెళ్లికి వెళ్ళాడు అంకిత్,అసలే సెలెబ్రిటీ పెళ్లి వచ్చే అథిధులకోసం ఎలాంటి సౌకర్యాలు చేస్తారో వేరే చెప్పనవసరంలేదు,మొత్తం 35 రకాల వంటలు రెడీ..నిజానికి ఆ పెండ్లికి వెయ్యిమందే వచ్చారట కానీ వంటలు మాత్రం…ఐదువేల మందికి సరిపడా వండారని తెలిసి అంకిత్ మనసు చలించిపోయింది,ఎందుకంటే నాల్గువేల మంది తినాల్సిన ఆహారం మొత్తం పెంటపాలు.దేశంలో ఎంతోమంది సరిగా తినటానికే  తిండిలేక అల్లాడుతుంటే…వీళ్లు ఇలా ఇంత ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారే అని చాలా బాధపడ్డాడు..ఆ బాదలోంచి వచ్చిన ఓ ఆలోచనే …అంకిత్ కు తను పయనించాల్సిన దారేంటో స్పష్టంగా అర్ధమైంది.

ఫీడ్ ఇండియా..!

 

పెండ్లిళ్లు ,పేరంటం,పుట్టినరోజు,మీటింగు ఇలా ఏ ఫంక్షన్ అయినా సరే  ఆహారం మిగిలితే ఒక్కఫోను కొట్టండి,ఆ ఆహారాన్ని తినడానికి తిండిలేని నిరుపేదల కడుపు నింపుతాం అని చెప్పాడు,ఆఫీస్ లు,క్యాంటీన్లు,రెస్టారెంట్లు ఇలా అందరి దగ్గరకు వెళ‌్లి ..ప్లీజ్ మిగిలిపోయిన ఫుడ్ ని పారేయకండి, దయచేసి మాకు ఇవ్వండి…అని చెప్పాడు.అంతే అలా వచ్చిన ఫుడ్ తో ఎంతో మంది పేదల ఆకలి తీర్చాడు,కాలీ కడ్పులతో పండుకునెటోళ్లకు కడుపునిండా  అన్నం దొర్కిందని వాళ్లు పడే ఆనందం.వాళ్లు చూపే కృతజ్డతా భావం చూసి అంకిత్ మనసు చెలించిపోయింది…వెంటనే చేస్తున్న జాబ్ మానేసాడు…ఫీడ్ ఇండియా పేరు ఓ సేవా సంస్ధను స్ధాపించాడు.దీని ముఖ‌్య లక్ష్యం..ఏడ ఆహారం మిగిలినా దాన్ని…తీసుకెళ్లి  నిరుపేదకుటుంబాల ఆకలి తీర్చాలని.ఇప్పటివరకు అంకిత్ కోటి మందికి పైగానే పేదల ఆకలి తీర్చాడంటే అర్ధంచేసుకోండి…దేశంలో ఎందరు అభాగ్యులు అన్నంకోసం అలమటిస్తున్నారో.నిజంగా అంకిత్ లాంటి యువశక్తులు తల్చుకుంటే దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందనేది వాస్తవం,ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది.అతను మొదలు పెట్టిన ఫీస్ట్ ఇండియా ఇప్పుడు 43 నగరాలలో విస్తరించింది.

ఆహారం విలువ తెలుసుకోండి,మీరు వృథాచేసే దాంట్లో నాలుగు మెతుకులు దొర్కినా అదే మహాప్రసాదం అని కళ్లకద్దుకొని తినే అభాగ్యులు ఎందరో ఉంటారు,కనీసం వాళ్ల ఆకలిని తీర్చి…ఆకలి చావులులేని ప్రపంచంకోసం పాటు పడండి.