జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎం అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుంది. ప్రతి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయిలు ఇచ్చి పేదలకు ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చి, ఇప్పటికీ కేవలం ఐదు ఇళ్లను మాత్రమే కట్టారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “జగన్.. సీఎం కాకముందు తన బైబిల్లో నేను సీఎం అయితే, ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలతో ప్రతి సంవత్సరానికీ ఐదు లక్షల ఇళ్లు కడుతామని మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు తప్పినారు. సిగ్గు అనిపించటం లేదా జగన్ మీకూ” అంటూ ఎద్దేవా చేశారు.