ప్రోగ్రాంకు పిలవలేదని ఏడ్చేసిన ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రోగ్రాంకు పిలవలేదని ఏడ్చేసిన ముఖ్యమంత్రి

February 14, 2020

Mamata Banerjee.

కోల్‌కతాలో ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి అక్కడి అధికార తృణమూల్ పార్టీ నేతలను ఎవ్వరినీ ఆహ్వానించలేదు. ఆహ్వాన పత్రికలో కూడా తృణమూల్ నాయకుల పేర్లు ఎక్కడా ప్రచురించలేదు. ప్రస్తుతం ఈ అంశం వివాదమవుతోంది. కేంద్రం చేసిన పనికి తృణమూల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వివాదంపై తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను కేంద్రం ఆహ్వానించకపోవడంపై తాను చాలా బాధపడ్డానని వెల్లడించారు. ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని, దీని కోసం చాలా కష్టపడ్డానని, అలాంటిది ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం ఆహ్వానించకపోవడం విడ్డూరమని వాపోయారు. ‘నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా. కనీసం నాకు సమాచారం అందివ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేశారు’ అని ఆమె వాపోయారు.