మరో షీరో.. ఫీమేల్ పైలట్‌ ప్రయాణం మీకోసం(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మరో షీరో.. ఫీమేల్ పైలట్‌ ప్రయాణం మీకోసం(వీడియో)

March 22, 2020

x vbnm

గత వారం ఓ షీరోను పరిచయం చేసిన మైక్ టీవీ ఈవారం కూడా మరో షీరోను పరిచయం చేస్తోంది. ‘మహిళలు ఈ పని చేయకూడదు. అది పురుషుల పని. మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు’ అని తమనుతాను శక్తి హీనులుగా భావించుకుని మహిళలు వంటింటి కుందేళ్లుగా మారిపోతున్నారు. కానీ కొందరే తమ మెదళ్లలోకి బలవంతంగా జొప్పించిన బూజుపట్టిన సిద్ధాంతాలను తెంచేసి తమ సంకల్పాన్ని సాధిస్తారు. మేమింతే.. మా బతుకు ఇంతే అనుకునే ఎందరో అశక్తులు అనుకునే మహిళలకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ధీర వనితే వినీల. 42 ఏళ్ల వయసులో మంచి ఫిట్‌నెస్ బాడీని సాధించి, లేడీ బాడీబిల్డర్‌గా, ఫోటోగ్రాఫర్‌గా, గాయనిగా ఇలా బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న కిరణ్ దేంబ్లాను పరిచయం చేశాం. ఇప్పుడు వినీలా మేడికొండను మీకు పరిచయం చేస్తున్నాం. లేడీ పైలట్‌గా రాణిస్తున్న ఈమె నుంచి మహిళలు ఎంతో స్ఫూర్తిని పొందొచ్చు. ఎయిర్ లైన్స్ ఆఫ్ ఇండియాలో ఆమె పైలట్‌గా రాణిస్తున్నారు. 

స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచే ఆమె పైలట్ కావాలని అనుకుందట. అందుకు తల్లిదండ్రుల సహకారం లభించడంతో ఆమె తన కలను నెరవేర్చుకుని నిలబడింది. పిల్లల మనసు ఎరిగి ఆ దిశలో కుటుంబ సభ్యులు చేసిన సపోర్ట్ ఎంతో అని చెబుతున్నారు వినీల. ఇంజనీరింగ్ పూర్తిచేసి కెనెడా వెళ్లి అక్కడ పైలట్‌గా శిక్షణ పొందానని చెప్పారు. తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె పడ్డ శ్రమ, పట్టుదల, కృషి గురించి మీరూ తెలుసుకోవాలంటే క్రింది లింకులో పూర్తి వీడియోను చూడండి.