తెలంగాణ డాక్టర్లకు సెలవులు రద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ డాక్టర్లకు సెలవులు రద్దు..

September 19, 2019

Fever effect .. cancellation of holidays for doctors

విష జ్వరాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో నిండి వుంటున్నాయి. దీంతో డాక్టర్ల కొరత వుందని ఆస్పత్రుల వద్ద రోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లకు సెలవులు రద్దు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వైద్యులు కూడా ఆలోచించి మరింత సమయం కేటాయించి ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఈటల కోరారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు మిగతా జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్లకు సెలవులు రద్దు చేశామన్నట్టు వెల్లడించారు. ఫీవర్ ఆస్పత్రిలో 6 కౌంటర్లకు నుంచీ 25 కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, మౌలిక వసతుల కల్పపనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. శాసనసభలో వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జ్వరాలపై ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని, రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలి అని మంత్రి అన్నారు.