నేను అతికించుకున్నాగా.. ఫెవీక్విక్ బామ్మ ఇక లేరు.  - MicTv.in - Telugu News
mictv telugu

నేను అతికించుకున్నాగా.. ఫెవీక్విక్ బామ్మ ఇక లేరు. 

November 29, 2019

ఫెవిక్విక్ బామ్మగా టీవీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న బాలీవుడ్ నటి పుష్పా జోషి ఇక లేరు. 87 ఏళ్ల పుష్ప ఈ నెల 26న చనిపోయారు. ఇంట్లో కాలుజారి కింద పడిన ఆమె ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత వృద్ధాప్యంలోనూ చురుగ్గా ఉన్న బామ్మ చుట్టుపక్కల వారిని తెగ నవ్వించేశారు. 

ఆమె ప్రతిభను గుర్తించిన బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ గుప్తా ‘రైడ్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంతో ఆకట్టుకున్న బామ్మ తర్వాత తర్వాత ‘రాంప్రసాద్‌ కి తెహర్వీ’ చిత్రంలో నటించి సత్తా చాటారు. తన కొడుకు నిర్మించిన ‘జాక్యా’ షార్ట్ ఫిలింలో నటించడంతో ఆమెకు సినిమాల్లో నటించడం ఈజీ అయ్యింది. ఫెవిక్విక్ యాడ్‌లో పగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతికించుకుని అలంకరించుకునే బామ్మగా నవ్వులు పూయించారు పుష్ప.