few confusion about telanagana new sachivalayam fire accident
mictv telugu

సచివాలయ అగ్నిప్రమాదంపై గందరగోళం..అసలు కారణమేంటీ.. ?

February 3, 2023

few confusion about telanagana new sachivalayam fire accident

తెలంగాణ నూతన సచివాలయ అగ్నిప్రమాదంపై గందరగోళం నెలకొంది. ప్రమాదం జరిగిన కారణాలపై క్లారిటీ లేకపోవడం చర్చనీయాంశమైంది. మొదట అగ్ని ప్రమాదం కాదు మాక్ డ్రిల్‌లో భాగంగా మంటలు వచ్చాయని పోలీసులు ప్రకటిస్తే.. స్వల అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని కొంతమంది చెబుతున్నారు.

కొద్ది పాటి సమయంలోనే చెరో మాట చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట మాక్ డ్రిల్ అని పోలీసులు ఎందుకు చెప్పారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు సచివాలయంలో అగ్నిప్రమాదంపై విపక్షాలు మండిపడుతున్నాయి. హడావుడిగా క్వాలిటీ లేని పనులు చేయిస్తుండడంతో ప్రమాదం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి బయల్దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

శుక్రవారం తెల్లవారుజామున కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ప్లాస్టిక్ మెటిరియల్‎కు మొదట మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజున కొత్త సచివాలాయాన్ని ప్రారంభించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.