ఓర్ని..భానుమతి చెప్పుకు గుడ ఫిదా అయ్యితున్రు...! - MicTv.in - Telugu News
mictv telugu

ఓర్ని..భానుమతి చెప్పుకు గుడ ఫిదా అయ్యితున్రు…!

July 27, 2017

ఫిదా సిన్మల భానుమతి హీరో ఐలవ్యూ శెపితే.. చెప్పును ఫొటో దీశి పంపిస్తది,ఇగ దాన్ని హీరో ప్రింట్ తీశి ఇంట్ల అద్దానికి అంటించుకుంటడు,ఫోనుల వాల్ పేపర్ గా..పెట్టుకుంటడు,మాటికోపారి దాన్ని చూస్కుంటుంటడు.కనీ ఇప్పుడు గదే భానుమతి చెప్పు ఫేసు బుక్కులల్ల,వాట్సప్పులల్ల శెక్కర్లు గొడుతుంది,గ శెప్పుమీద లైకులు,కామెంట్లుగుడ బాగనే అస్తున్నయ్,ఫేసుబుక్కులల్ల గ శెప్పును జూశి…ఇది ఫిదా సిన్మల భానుమతి శెప్పు అని టక్కున గుర్తు వడ్తున్రట, అంతేగాదు కొందరైతే ఫేస్ బుక్ స్టేటస్ లు,డిపిలు,వాట్సప్ డిపిలు గుడ గ శెప్పునే వెట్టుకుంటున్నరంటే సూడున్రి భానుమతి(సాయి పల్లవి) శెప్పు ఎంత పాపులర్ అయ్యిందో,అంటే ఇదివర్కు శ్రీదేవి ముక్కుపుల్ల, రాజమౌళి సిన్మలల్ల కత్తులు గొడ్డల్లు ఫేమస్ ఐనట్టు..ఫిదా సిన్మల భానుమతి శెప్పుగుడ ఫేమస్ అయ్యింది అన్నట్టు.ఇగ రేపు రేపు గిది ఫిదా సిన్మల భానుమతి వాడిన శెప్పని..వేలం పాట వెట్టినా ఆశ్చర్య పోవలసిన అవుసరం లేదు.శెప్పుల దుకాన్లకోయిన ఆడోళ్లు.. ఫిదా సిన్మల భానుమతి వాడిన శెప్పులున్నయా అని అడిగినా అడుగుతరు గావచ్చు.