బద్మాష్ బలిసిందారా... - MicTv.in - Telugu News
mictv telugu

బద్మాష్ బలిసిందారా…

June 18, 2017

 

బద్మాష్ బలిసిందారా…. బొక్కలిరగొడ్తా… అనంగనే ఏం గుర్తుకొస్తది… హైద్రాబాద్ల ఏవరో పేరు మోసిన రౌడీనో… గుండానో ఎవర్నో బెదిరించారని అనుకుంటం కదా..కానీ అది కాదు విషయం. నాగబాబు తనయుడు  వరుణ్ తేజ్ ను ఓ అమ్మాయి   ఇట్లా బెదిరించింది…. అరే ఒక అమ్మాయి  చేతిల ఎందుకిట్ల తిట్లు తిన్నడని అనుకుంటున్నర… కాసేపు ఆగండి… ఇది శేఖర్ కమ్ముల తీస్తున్న ‘‘ఫిదా’’ సిన్మా ట్రైలర్.  ఇలాంటి మాటలు సహజంగా తెలంగాణల అంటరని అనుకుంటరు గద. అందుకే శేఖర్ కమ్ముల  మాంచి బిజినెస్ ట్రిక్ వాడినట్లుంది. అయినా ఇంతకు ముందు నుండి కూడా శేఖర్  తన సిన్మాల్ల హైద్రాబాద్  భాష వాడారు.  ఏకంగా హిరోనే  బద్మాష్ బలిసిందారా….  అనే వరకల్లా జెర కంత ఆలోచిస్తం కదా… ఇదో మోటు సరసం అన్నట్లు. అయితే హీరో మాత్రం  సరసానికి ఫిదా అయ్యాడట మరి.