తరుణ్ భాస్కర్ తల్లే...భానుమతికి అత్త..! - MicTv.in - Telugu News
mictv telugu

తరుణ్ భాస్కర్ తల్లే…భానుమతికి అత్త..!

July 25, 2017

ఫిదా సిన్మల  సాయిపల్లవి (భానుమతి)కి అత్తగా చేసింది మరేవరోకాదు,పెళ్లి చూపులు సిన్మా  డైరెక్టర్  తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ.ఆమె పేరు గీతా భాస్కర్…భాను  దుకాన్ల కొయ్యి శనిగె పిండి, గుడ్లు జల్ధిన పట్కరాపో వంటి డైలాగులతో ఫిదా సిన్మ లో   భానుమతి అత్తమ్మగా అందర్ని మెప్పించింది,తనదైన తెలంగాణ యాసతో  ఏంతో నేచురల్ గా నటించి అందర్ని ఫిదా జేశింది. ఫిదాలో తన తల్లి గీతా భాస్కర్ మంచి పాత్రలో కనిపించి.. గొప్పగా నటించిందని కితాబిచ్చారు తరుణ్‌భాస్కర్, తన తల్లికి నటిగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ నేచురల్ గా నటించిందని తరుణ్ భాస్కర్ తెలిపారు.,ఇగ సాయిపల్లవి అదే భానుమతి గురించి  ఎంత జెప్పినా తక్కోనే  రొండు కులాలు రొండు మతాలు భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల అంటూ భానుమతి  అందరి మతి పోగొట్టింది.నిజంగా శేఖర్ కమ్ముల  తెలంగాణా నేటివిటీని, తెలంగాణ కల్చర్ ను  ఈ సినిమాలో చూపించి  ఎంతోమంది యువదర్శకులకు ఆదర్శమయ్యాడనే చెప్పాలి.