ఫిడెల్ కాస్ట్రో కుమారుడి ఆత్మహత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫిడెల్ కాస్ట్రో కుమారుడి ఆత్మహత్య..

February 2, 2018

అమెరికాకు వెన్నులో వణుకుపుట్టించిన క్యూబా దివంగత అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో పెద్ద కుమారుడు ఫిడెల్ కాస్ట్రో డియాజ్‌ బలార్ట్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. 68 ఏళ్ల డియాజ్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. గురువారం పొద్దున ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని క్యూబా అధికారిక మీడియా గ్రాన్మా తెలిపింది. డియాజ్ ప్రస్తుతం తన చిన్నాన్న అయిన రౌల్ కాస్ట్రో సారథ్యంలోని  క్యూబా సర్కారుకు శాస్త్ర సలహాదారుగా ఉన్నారు.డియాజ్.. ఫిడెల్ కాస్ట్రో తొలి భార్య మీర్టా డియాజ్ కొడుకు. ఆయన తండ్రిని పోలి ఉంటారు కనుక అభిమానులు ఫిడెలిటో అని పిలుస్తుంటారు. తండ్రిబాటలో పయనించిన డియాజ్ నాటి సోవియట్‌ యూనియన్‌లో చదువుకున్నారు. అక్కడే కొన్నేళ్లు  అణుశాస్త్రవేత్తగా  పనిచేశారు. క్యూబా న్యూక్లియ్ పవర్‌ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా క్యూబా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తండ్రి మరణంతోపాటు పలు సమస్యలతో మానసిక ఆందోళను గురైన డియాజ్ కు వైద్యులు కొన్ని నెలలుగా చికిత్స అందిస్తున్నారు.