‘ఫిదా’కు అరుదైన అవార్డ్  - MicTv.in - Telugu News
mictv telugu

‘ఫిదా’కు అరుదైన అవార్డ్ 

September 7, 2017

శేఖర్ కమ్ముల  మార్క్ తో  వచ్చిన ‘ఫిదా’  సిన్మ  అందరిని  ఫిదా జేసిన విషయం తెల్సిందే. అందులో భానుమతిగానటించిన సాయిపల్లవి అందరి మనసు కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లనే సాధించింది ఈ సినిమా.  ఇప్పుడు  ఫిదా సినిమా ఈ ఏడాది  ’అక్కినేని-వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు’  అందుకోబోతుంది. వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ 45వ వార్షికోత్సవం,  నటసమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడిగా ‘ఫిదా’ కి  శేఖర్‌ కమ్ములను, అత్యంత ప్రజాదరణ పొందిన ‘వచ్చిండే’ (ఫిదా) పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసారు. తెలంగాణ పర్యాటక శాఖ  సహకారంతో సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో జరిగే అక్కినేని 94వ జయంతి సభలో ’ ఫిదా’ సినిమాకు ఈ అవార్డు ఇవ్వనున్నారు.