వీడియో : మనిషి, కంగారూల మధ్య భీకర పోరు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : మనిషి, కంగారూల మధ్య భీకర పోరు

June 1, 2022

ఆస్ట్రేలియా ఖండంలో కనిపించే కంగారూలు చాలా సాఫ్ట్ జంతువులని మనం ఇప్పటివరకు విన్నాం. కానీ, ఈ వీడియో చూస్తే అది తప్పని తెలుసుకుంటారు. కోపంలో ఉన్న ఓ కంగారూ ఓ వ్యక్తిపై దాడి చేసి అతడిని గాయపరిచింది. అంతేకాక అందుబాటులో ఉందని అతని చేతి వేలిని కూడా కొరికేసింది. పూర్తి వివాలు ఇలా ఉన్నాయి. సెంట్రల్ విక్టోరియా ప్రాంతంలో నివసిస్తున్న క్లిఫ్ డెస్ అనే వ్యక్తి తన పెరట్లో పని చేసుకుంటుండగా, కుక్కలు గట్టిగా అరవడం విన్నాడు. దాంతో ఏం జరిగుంటదని వెళ్లి చూడగా, పెరట్లోంచి ఆరడుగుల ఎత్తు ఉన్న కంగారూ తనకేసి రావడం గమనించాడు. దాంతో అప్రమత్తమై పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆ లోపే కంగారూ డెస్‌ని సమీపించి మీదపడి దాడి చేసింది. దాన్నుంచి తప్పిచుకోవడానికి డెస్ శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఎదురు తిరగడం మేలనుకొని తిరిగి కంగారూపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది. కంగారూ డెస్‌ని కిందపడేసి, కాలితో తొక్కి గాయపరిచినా తిరిగి లేచి దానితో కలయబడ్డాడు. కాసేపు పోరు తర్వాత డెస్ మళ్లీ తప్పించుకుందామని పరుగెత్తగా, కంగారూ అతడిని వెంబడించి డ్రెస్సుని పూర్తిగా చించేసింది. అతని కారు చుట్టూ పరిగెత్తించి నిజంగా కంగారు పెట్టించింది. ఇలా ఇద్దరి మధ్య పోరు ఆరు నిమిషాల పాటు జరిగింది. కాగా, కంగారూలు కోపంలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని జంతు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.