కాంగ్రెస్ నేత, ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు తమ చర్యల్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను పట్టుకోగా, మిగిలిన ఇద్దరు కీలక నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అమృత్సర్ సమీపంలోని భక్నా వద్ద గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. జగ్రూప్సింగ్, మన్ప్రీత్సింగ్లను పట్టుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా, ప్రజలెవరూ కూడా బయటకి రావొద్దని పోలీసులు స్థానికులకు సూచించారు. ఇళ్లల్లో ఉండి తమకు సహకరించాలని కోరారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్ర గాయాలపాలవగా వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. అయితే ఈ కాల్పుల్లో జగ్రూప్ సింగ్ ఎన్కౌంటర్ అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా, మే 29న జరిగిన సిద్ధూ మూసేవాలా హత్య పంజాబులో సంచలనంగా మారింది.