నెలరోజులు పాటూ ఫిఫా వరల్డ్ కప్ ప్రపంచాన్ని ఊపేసింది. ఖతార్ లో జరిగిన సాకర్ సమరంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ తో తలపడిన అర్జెంటీనా చాలాఏళ్ళ తర్వాత కప్ ను కైవసం చేసుకుంది. చివర వరకూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఫైనల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు హోరాహోరీగా సాగింది. మెస్సీతో పాటూ ఎంబాపా కూడా సమానంగా ఆడాడు. ఫ్రాన్స్ ఓడిపోయి ఉండచ్చు కానీ ఎంబాపా మాత్రం గెలిచాడు. ఫిఫా వరల్డ్ కప్ లో విజేతలు ఇద్దరు…ఒకరు మెస్సీ, మరొకరు ఎంబాపా.
ఇక మొత్తం వరల్డ్ కప్ లో ఎవరెవరు ఏమేమి గెలుచుకున్నారు. ఏ టీమ్ కు ఎంత మనీ ప్రైజ్ వచ్చింది అని చూస్తే…విన్నర్ అర్జెంటీనా 347 కోట్లు, ఫ్రాన్స్ 248 కోట్లు, మూడవ పొజిషన్ లో ఉన్న క్రోయేషియా 223కోట్లు సంపాదించుకుంది. మొరాకో 206కోట్లు గెలుచుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిన జట్లకు 140 కోట్లు చొప్పున, ప్రిక్వార్టర్ ఫైనల్స్ లో ఓడిన జట్లకు 107 కోట్లు, గ్రూప్ లీగ్ దశలోనే వెనుతిగిరిన జట్లకు 74కోట్లు దక్కాయి.
ఈ వరల్డ్ కప్ లో మొత్తం 172 గోల్స్. ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ లలో ఇవే ఎక్కువ. 1998, 2014లలో 171 గోల్స్ నమోదయ్యాయి. మొత్తం 64 మ్యాచ్ లు జరిగాయి. 217 ఎల్లో కార్డులు, 3 రెడ్ కార్డులు వచ్చాయి. మొత్తం టోర్నీలో ఫ్రాన్స్ ఎక్కువగా 16 గోల్స్ చేసింది. 8 గోల్స్ ఒకే మ్యాచ్ లో నమోదయ్యాయి. టోర్నీలో నమోదైన సెల్ష్ గోల్స్ 2. హ్యాట్రిక్ లు 2 సార్లు వచ్చాయి. ఎంబాపె, గొంకాలో రామోస్ లు హ్యాట్రిక్ లు చేసారు.
గోల్డెన్ బాల్ అంటే బెన్ట్ ప్లేయర్ గా లియోనల్ మెస్సీ, గోల్డెన్ బూట్ అంటే టాప్ స్కోరర్ గా ఎంబాపె 8గోల్స్ తో గెలుచుకున్నారు. బెస్ట్ గోల్ కీపర్ గా అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్, 34సార్లు గోల్స్ అవ్వకుండా చూశాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్ గా అర్చెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండేజ్ నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ లియోనల్ మెస్సీ దక్కించుకున్నాడు. ఫెయిర్ ప్లే అవార్డును ఇంగ్లండ్ ను కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా.. మెస్సీ పేరిట రెండు రికార్డులు