ఖతార్ లో జరుగుతున్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో క్వార్టర్ మ్యాచులు ఖరారయ్యాయి. ఏయే తేదీల్లో ఏయే జట్లు తలపడనున్నాయో వివరాలు వచ్చేశాయి. డిసెంబర్ 9న ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో క్రొయేషియా దిగ్గజ బ్రెజిల్ జట్టుతో తలపడుతుంది.
10న నెదర్లాండ్స్ అర్జెంటీనాతో, పోర్చుగల్ మొరాకోతో పోటీ పడతాయి. 11వ తేదీన ఫ్రాన్స్ ఇంగ్లండుతో తలపడుతుంది. ఈ సెషన్ లో ఈ మ్యాచే హైలెట్ అని చెప్తున్నారు. ఇక 14, 15 తేదీల్లో సెమీస్ మ్యాచులు, డిసెంబర్ 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అటు నెదర్లాండ్స్ అర్జెంటీనా మ్యాచ పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ప్రముఖ ఆటగాడు మెస్సీ అంచనా ప్రకారం పోర్చుగల్, బ్రెజిల్, అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు సెమీస్ కి వెళతాయని, చివరికి కప్ కూడా ఈ నాలుగు జట్లలో ఒకరు గెలుచుకుంటారని జోస్యం చెప్పాడు. మరి ఆయన అంచనా ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.