జగన్ కీలక నిర్ణయం..ఉద్యోగాల్లో 50శాతం మహిళలకే - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ కీలక నిర్ణయం..ఉద్యోగాల్లో 50శాతం మహిళలకే

November 12, 2019

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు ఏపీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌‌ను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. 50శాతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలని ప్రకటించారు. 

jagan

1 జనవరి 2020 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ప్రతి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగానికి కోడ్‌ నెంబర్‌ ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్‌ను ఒక ఎంటీటీగా తీసుకోవాలి. మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు లంచాలు తీసుకొని ఇచ్చే దుస్థితి ఉండకూదన్నారు. లంచాలు, మోసాలకు అవకాశం లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చేలా చూస్తామన్నారు. డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు.