గణనాథుడిని లడ్డూలతో ముంచెత్తిన భక్తులు - MicTv.in - Telugu News
mictv telugu

గణనాథుడిని లడ్డూలతో ముంచెత్తిన భక్తులు

September 12, 2019

ganesh...

గణనాథుడికి లడ్డూ అంటే ఎంతో ప్రీతి. ఆయనకు వినాయక నవరాత్రుల్లో లడ్డూ ప్రసాదాలను ప్రత్యేకించి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. లంబోదరుడికి ఇష్టమైన వంటకాలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్ ప్రాంతంలోని గణేషుడికి ఏకంగా 56 వేల లడ్డూలను తయారు చేసి గణనాథుడిని ముంచెత్తారు. 

ఈ గణేష్‌ మండపానికి 24 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇక్కడి స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ప్రతి ఏటా ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకతతో గణనాయకుడిని పూజిస్తారు. ఈ ఏడాది భక్తులు లడ్డూల రూపంలో తమ భక్తిని చాటుకున్నారు. 56 వేల లడ్డూలను లంబోదరుడికి సమర్పించారు. భక్తులతో కలిసి నిర్వాహకులు వీటిని తయారు చేశారు. ఈ లడ్డూలను వినాయకుడి చెంత ఉంచి పూజలు చేశారు. వీటిని శోభాయాత్ర సందర్భంగా భక్తులకు పంచిపెట్టనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.