తొక్కేస్తాడనుకున్న బాలయ్య.. బాస్ దెబ్బకు బోల్తా కొట్టాడుగా - MicTv.in - Telugu News
mictv telugu

తొక్కేస్తాడనుకున్న బాలయ్య.. బాస్ దెబ్బకు బోల్తా కొట్టాడుగా

November 26, 2022

రాబోయే సంక్రాంతి పండగరోజున అగ్ర హీరోల పోరుకి ఇదొక సాంపిల్ మాత్రమే. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ కి ట్రైలర్ చూపెట్టారు చిరు, బాలయ్యలు. ప్రస్తుతం సోషల్ మీడియాని మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాల ప్రమోషన్స్ హీటెక్కిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు టైటాన్స్ సంక్రాంతి బరిలోకి రావటంతో సినీ వాతారవరణం వేడెక్కింది. వీరయ్య, బాలయ్యల సినిమాల్లోని ఇంట్రో సాంగ్స్ రెండు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. చిరంజీవి పాటకి దేవిశ్రీ సంగీతం అందిస్తే.. బాలయ్య సాంగ్ కి తమన్ మ్యూజిక్ చేశాడు. వాల్తేరు వీరయ్య మొదటి సింగిల్ ‘బాస్ పార్టీ’ ఇప్పటికే డీజేలు బద్దలుకొడుతుంది. దేవి శ్రీ ప్రసాద్ అపియరెన్స్, ఊర్వశి రౌతేలా మెరుపులు, అన్నింటికీ మించి మెగాస్టార్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ బాస్ పార్టీ పాటని సూపర్ హిట్ చేశాయి.

ఇక థమన్ సంగీతం అందించిన వీరసింహారెడ్డి తోలి సింగిల్ “జై బాలయ్య” పాట ఎప్పటిలానే నందమూరి అభిమానులని ఉర్రుతలూగిస్తుంది. ‘జై బాలయ్య’ అనే క్యాచీ పదాలతో సాగే ఈ సాంగ్ మాస్ ని థ్రిల్ చేసింది. దీంతో బాస్ పార్టీ, జై బాలయ్య పాటల మధ్య యూట్యూబ్ లో యుద్ధం మొదలైంది. ఈ రెండు పాటలు అభిమానులను ఉత్తేజపరుస్తున్నా.. బాస్ పార్టీకి యూట్యూబ్ లో కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. యూత్ ఎక్కువగా బాస్ పార్టీకే మొగ్గుతున్నారు. జై బాలయ్య ట్యూన్ యావరేజ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వ్యూస్ విషయానికి వస్తే… బాస్ పార్టీ సాంగ్ 24 గంటల్లో 9.51 మిలియన్ల వ్యూస్, 250.6కే లైక్స్ వచ్చాయి. అదే జై బాలయ్య పాట అయితే.. 7.00 మిలియన్ల వ్యూస్, 208K లైక్స్ వచ్చాయి. అంటే బాస్ పార్టీకే మంచి రెస్పాన్స్ వచ్చినట్టు. జై బాలయ్య పాటను జనాలు అంతగా పట్టించుకోనట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి.