హైదరాబాద్లోని గాంధీ భవన్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరును చక్కిదిద్దేందుకు వచ్చిన దిగ్విజయ సింగ్ లోపల సమావేశాలు జరుపుతుండగా..బయట పార్టీ శ్రేణులు కొట్లాటకు సిద్ధమయ్యారు. తమకు అన్యాయం జరిగిందని గాంధీభవన్ వద్ద ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు.
వారిని పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అనిల్ సముదాయించే ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. మధ్యలో సీనియర్ నేత మల్లు రవి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ వారు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ లోపలికి పంపి గేట్ తాళం వేశారు. లోపల చర్చలు జరుగుతున్నా సమయంలో గొడవకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని చేతులు జోడించి కోరారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
డీహెచ్ శ్రీనివాసరావును రోడ్లపై ఉరికించి కొట్టాలె.. బండి సంజయ్
చంద్రబాబు పాలనలోనే తెలంగాణ దోపిడికి గురైంది: హరీష్ రావు